Monday, June 21, 2010

నీ కోసమే



నీ కోసమే నా ఈ ఎదురు చూపు,
నిను చేరాలనే నా ఈ ప్రయాణం,
నీకై పలితపించే నా మనసు పడే వేదన నీకెలా తెలియజేయను,

నీ కౌగిళ్ళలో నన్ను నేను మరిచిపోయే క్షనానికయ్,
నీకైన ఈ నిరీక్షణ నాలోని ప్రేమని రెట్టింపు చేయుచున్నది,
నా చిన్ని గుండెలోని తియ్యననుభుతిని నీకెలా తెలియజేయను,

నా కళ్ళు నీ రూపుకై, నా పెదవులు నిను పిలిచెందుకై,
నా చెవులు నీ మాటలకై, నా శ్వాస నీ శ్వాసకై,
నా దేహం నీ స్పర్శకై పడే తపన నీకెలా తెలియజేయను,

ప్రతిక్షణం నీతో గడపాలని, ప్రతిక్షణం నీకు తోడుగా ఉండాలని,
ఏ చెడు చూపు నీ పైన పడకుండా నిన్ను కాపాడాలని ,
నా మనసు పడే తపన నీకు ఎలా తెలియజేయను,

నీవు నా తోడూ ఉంటే ఈ ప్రపంచాన్నైనా గెలవాగలను,
నీవు లేని నా జీవితాన్ని ఉహించుకోలేను,
నీతో గడిపిన ప్రతిషణం నాకెంత వివులువైనదొ నీకెలా తెలియజేయను నా ప్రాణమా....

1 comment: